వైభవంగా కోదండరామయ్య రథోత్సవం
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులను అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి రథం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చి కార్యక్రమాన్ని తిలకించారు.