కనకమహాలక్ష్మికి ఘనంగా పూజలు

కనకమహాలక్ష్మికి ఘనంగా పూజలు

VSP: విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మొత్తం 18 మంది ఉభయదాతలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీచక్ర నవావరణార్చన, లక్ష్మీ హోమం పూజల్లో ఇద్దరు, తులసీ దళార్చనలో ఒకరు, శ్రావణ లక్ష్మీ పూజల్లో 18 మంది భక్తులు పాల్గొన్నారు.