'8' ఆకారంలో ప్రయాణం.. 'NASA' వీడియో రిలీజ్
చంద్రుడిపైకి మనుషులను పంపే నాసా 'ఆర్టెమిస్ II' మిషన్ ప్రయాణం నేరుగా కాకుండా ఒక విభిన్న మార్గంలో సాగనుంది. సుమారు 10 రోజుల పాటు సాగే ఈ యాత్రలో వ్యోమగాములు మొదట భూమి చుట్టూ రెండుసార్లు కక్ష్యలో తిరుగుతారు. ఆ తర్వాత చంద్రుడి వెనుక భాగం నుంచి '8' ఆకారంలో లూప్ వేసి, మళ్లీ సురక్షితంగా భూమికి చేరుకుంటారు. నాసా తాజాగా ఈ రూట్ మ్యాప్ వీడియోను రిలీజ్ చేసింది.