వేపాడలో నీట మునిగిన పంట పొలాలు

వేపాడలో నీట మునిగిన పంట పొలాలు

VZM: వేపాడ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దబ్బిరాజుపేట నాడి చెరువు పుష్కలంగా నిండింది. దీంతో చెరువుకు ఆనుకుని ఉన్న సుమారు 4 ఎకరాల వరి పంట నీట మునిగిందని రైతులు తెలిపారు. తక్షణమే రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.