'ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి సారించాలి'

'ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి సారించాలి'

BDK: పదో తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారిణి నాగలక్ష్మి సూచించారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర ఉన్నత పాఠశాలను గురువారం పరిశీలించారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి సన్నద్ధం చేయాలన్నారు. అనంతరం తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.