రైతుల ఖాతాల్లో పరిహారం డబ్బుల జమ
MDK: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ భూసేకరణ చివరి దశకు చేరుకున్నట్లు తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి తెలిపారు. తూప్రాన్ మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన 178 మంది రైతుల ఖాతాల్లో రూ. 13 కోట్ల పరిహారం జమ చేసినట్లు వివరించారు. డబ్బులు పడని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆర్డీవో జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.