డీకే వెనక్కి తగ్గింది అందుకేనా?
సీఎం పదవిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెనక్కి తగ్గటానికి హైకమాండ్ బుజ్జగింపే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎంను మారిస్తే పార్టీలో చీలకలు వచ్చి గ్రూపులు పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట. ఇటీవల కర్ణాటక తదుపరి సీఎంగా సతీష్ అవుతారని సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా డీకేను అధిష్టానం ఒప్పించినట్లు సమాచారం.