'సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలి'
AKP: ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు నిర్ణిత సమయంలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యన్నారాయణ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు.