మంత్రికి వినతి పత్రం అందజేసిన దళిత సంఘాల నాయకులు
KNR: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తిమ్మపూర్ మండల దళిత సంఘాల నాయకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తిమ్మపూర్ బస్‌స్టాండ్ వద్ద ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలుగా ముసుగులతో ఉన్న డా. బీఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను త్వరగా ఆవిష్కరించాలని కోరారు. బీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.