VIDEO: మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

VIDEO: మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

JGN: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై తాటికొండ రాజయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం చిల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి ఊరేగించారు. గ్రామపంచాయతీ నుండి శవయాత్ర కొనసాగించి సాంప్రదాయ పద్ధతిలో కుండ పట్టించారు. డాన్సులు చేసుకుంటూ టపాసులు కాల్చుకుంటూ అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.