నేటి నుంచి ఆధార్ శిబిరాలు
CTR: ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాల అప్డేట్‌కు ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు. జిల్లాలో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సినవారు 18 వేల మందికి పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి కోసం గ్రామ సచివాలయాల్లోని 125 కేంద్రాల్లో పిల్లలు ఆధార్‌లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.