హెల్మెట్ లేకపోతే పెట్రోల్ బంద్
VSP: పొల్యూషన్ సర్టిఫికెట్ లేని ఫోర్ వీలర్స్‌కు ఫ్యూయల్, హెల్మెట్ లేని టూ వీలర్స్‌కు పెట్రోల్ ఇవ్వబడదని ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. గోపాలపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు ఈ నిర్ణయానికి సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించారు.