ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
RR: శేరిలింగంపల్లి MLA, పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ శనివారం హఫీజ్‌పేట్ డివిజన్ సాయినగర్ కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇఫ్తార్ వేడుకలు మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకలని కొనియాడారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి ఇఫ్తార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.