‘రూ.1.37 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం’

గుంటూర్: రేపల్లెలోని వార్డుల్లో రూ.1.37కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఛైర్ పర్సన్ కట్టా మంగ తెలిపారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సాధారణ సమావేశం సోమవారం నిర్వహించారు. వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మాణం, నూతన ఫాగింగ్ యంత్రం కొనుగోలు, కొత్తగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.