చందాయిపేట పాఠశాలలో స్పోర్ట్స్ మీట్
MDK: చేగుంట మండలం చందాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించినట్లు HM కిషన్ తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించి జిల్లా స్థాయికి ఎంపికలు చేసినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపిస్తున్నట్లు వివరించారు.