AHTU.. NOVలో 24 కార్యక్రమాలు: ఎస్పీ
MBNR: మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(AHTU) -2025 నవంబర్‌లో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో మొత్తం 24 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మహిళా భద్రత విభాగం హైదరాబాద్ ఆదేశాల మేరకు.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్పోల్ ఆధ్వర్యంలో జరుగుతున్న 'ఆపరేషన్ స్ట్రోమ్ మేకర్స్-3' ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొనారు.