VIDEO: 'TTD తరహాలోనే యాదగిరిగుట్టలో నిత్యాన్నదానం'

యాదాద్రి: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇవాళ తిరుపతిలో స్వామి వారిని దర్శించుకుంది. అనంతరం ఆమె TTD అన్నదాన సత్రంలో భోజనం చేసి భక్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా TTD తరహాలోనే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ సేవలను కొనసాగించేందుకు కృషి చేస్తున్నామన్నారు.