'రోడ్డు భద్రతపై చిట్యాలలో అవగాహన సమావేశం'
NLG: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు 'అరైవ్ అలైవ్' పేరిట నేటి నుంచి 18 వరకు 6 రోజుల పాటు అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలు కలిసి చిట్యాల మున్సిపల్ కార్యాలయం ముందు సోమవారం రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్, బీమా వంటి విషయాలను ప్రజలకు వివరించారు.