జాతీయస్థాయి క్రీడాకారుడికి మంత్రి ఆర్థిక సాయం
KRNL: టైక్వాండో క్రీడలో జాతీయ స్థాయి పతకాలు సాధించిన కర్నూలు క్రీడాకారుడు విశ్వాసరావుకు మంత్రి టీజీ భరత్ ఇవాళ రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. తన నివాసంలో క్రీడాకారుడిని ప్రత్యేకంగా అభినందించి చెక్కును అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఫిట్నెస్‌ను పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. క్రీడల్లో రాణిస్తూ మంచి పేరు తీసుకురావాలన్నారు.