ఎస్జీటీ ఉద్యోగం సాధించిన కల్పన

MBNR: శ్రీరంగాపూర్ మండలంలోని తాటిపాముల గ్రామానికి చెందిన సోమనాథ్ శ్రీను భార్య కల్పన SGT (సెకండరీ గ్రేడ్ టీచర్) ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సాధించింది. ఈ మేరకు హైదరాబాదులోని LB స్టేడియంలో బుధవారం జరుగనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆమెకు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.