ఏనుమాముల మార్కెట్లో మక్కజొన్న రైతుల అవస్థలు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన కాంటాలు తీసుకెళ్లకపోవడంతో పదిరోజులుగా ధాన్యం మార్కెట్లోనే నిల్వ ఉంది. ముందస్తు ప్రణాళిక లేక బార్ధాన్ సంచులు అందించడంలో ఆలస్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు.