విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం

ATP: గుంతకల్లు పట్టణ శివారులో మంగళవారం లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.