పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

MDK: గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి సంబరాలను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. సంక్రాంతికి ముందు పాడిపంటలన్నీ ఇంటికి రావడంతో ఆనందంతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారన్నారు. చిన్నారులు రంగవల్లులు వేయడంతో పాటు పతంగులను ఎగురవేశారు.