ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులకు రాజ గౌడ్ ఆదేశాలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులకు రాజ గౌడ్ ఆదేశాలు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజ గౌడ్ ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులు, పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్ పనులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమై గృహ నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.