'దౌర్జన్యాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు'
SRPT: దాడులు, దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వరుస దాడులను కండిస్తూ బుధవారం సూర్యాపేట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. అరాచక శక్తులను ప్రోత్సాహించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తామంటే సహించేది లేదన్నారు.