'ఉచిత పథకాలు రద్దుచేసి విద్య, వైద్యం అందించాలి'

SRPT: ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అనవసరమైన ఉచిత పథకాలు రద్దుచేసి ప్రజలకు కావాల్సిన నాణ్యమైన విద్య, వైద్యం పూర్తిస్థాయిలో ఉచితంగా అందించాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఉచిత పథకాల పేరుతో గొప్పలకు పోయి వేలాదికోట్ల రూపాయలు వృధా చేస్తున్నారన్నారు.