జూనియర్ కళాశాలలో చేరాలని అడ్మిషన్ల ప్రచారం
BDK: లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మీసేవా కేంద్రాల వద్ద మిట్టగూడెం తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ (బాలుర) కళాశాల అడ్మిషన్ల ప్రచార కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యలో రాణించాలని కోరారు. అధ్యాపకులు విద్యార్థులు, తల్లిదండ్రులకు కళాశాలలోని కోర్సులు, వసతులపై అవగాహన కల్పించారు.