విశాఖ రుషికొండ బీచ్‌లో విషాదం
VSP: విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో ఆదివారం స్నానానికి దిగిన ఆరుగురు స్నేహితుల్లో అరవింద్ (21) మృతి చెందగా, రాజీవ్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీటెక్ విద్యార్థులు సముద్ర అలల తాకిడికి మునిగిపోయారు. గమనించిన లైఫ్‌గార్డులు వెంటనే వారిని ఒడ్డుకు తీసుకెళ్లి స్థానిక ఆసుపత్రికి తరలించారు.