మల్లేడవలసలో పర్యటించిన డీఆర్డీఏ పీడీ
VZM: మెంటాడ మండలం మల్లేడవలసలో స్వయం సహాయక సంఘాల రుణ ప్రణాళికల తయారీని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీఎం అన్నపూర్ణ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సభ్యురాలు తమ అవసరాలకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల నుంచే నూతన పారిశ్రామికవేత్తలు తయారయ్యేలా ప్రోత్సహించాలన్నారు.