ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
PLD: నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA చదలవాడ అరవింద్ బాబు పాల్గొని నరసరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.