'జిల్లాలో ఐటీడీఏని ఏర్పాటు చేయాలి'
శ్రీకాకుళం: జిల్లాలో వెంటనే ఐటీడీఏ ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాలను 5వ షెడ్యూల్లో చేర్చి 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా విభజన అనంతరం ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.