రోడ్డుకి మరమ్మత్తులు చేపిస్తున్న సర్పంచ్

KRNL: హోళగుందలో గత కొన్ని రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బురదగా మారిన రోడ్డుపై హోళగుంద సర్పంచ్ చలువాది రంగమ్మ పంచాయతీ సిబ్బందితో గ్రావెల్ వేయించి చదును చేయించారు. బస్టాండ్ నుంచి స్థానిక ఈర్ల కట్టవరకు డ్రైనేజీ లేక వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో రోడ్డు బురదగా మారింది. బస్టాండ్‌కి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి.