కోడిపందాల శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
కృష్ణా: తమిరిశ గ్రామంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలసి ఎస్సై శ్రీనివాస్ కోడి పందాల శిబిరంపై ఆదివారం దాడి చేశారు. కోడి పందాలు ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,400/- నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.