పశువుల జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం

పశువుల జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం

JGL: ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశు వైద్యాధికారి బూర మనోజ్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పగటి ఉష్ణోగ్రతలు 42 సెంటీగ్రేడ్లకు మించి నమోదు అవుతున్న క్రమంలో పశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.