'అనాథలైన చిన్నారుల విద్యా బాధ్యత నాదే'
VKB: యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బందెప్ప, లక్ష్మి దంపతులు ఇటీవల బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుమార్తెలు శివలీల(15), భవానీ(8) అనాథలయ్యారు. దీనిపై స్పందించిన BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ ఆ చిన్నారుల బాధ్యత తీసుకున్నారు. ఆ పిల్లల విద్యా, భవిష్యత్తు బాధ్యత నాదే అని, వారు ఒంటరిగా లేరని, మనం అందరం వాళ్ల కుటుంబం అని హామీ ఇచ్చారు.