వినాయక విగ్రహం వద్ద ఘనంగా అన్నదానం
KDP: పులివెందుల అంకాలమ్మపేటలోని వినాయకుడి విగ్రహం వద్ద శనివారం అన్నదానం నిర్వహించారు. ఈ మేరకు అంకాలమ్మ పేట యూత్ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ మేరకు సుమారు 500 మంది పైగా భక్తులకు అన్నదానం చేశారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పెద్దసంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.