PS ముందే యాక్సిడెంట్.. ఇదే కారణం!

PS ముందే యాక్సిడెంట్.. ఇదే కారణం!

VKB: తాండూర్‌లో పోలీస్ స్టేషన్ ముందే అడ్డగోలుగా వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా స్టేషన్ ఎదురుగా నిలిపి ఉన్న ఒక కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయాలు కానప్పటికీ, కారు పాక్షికంగా దెబ్బతిన్నది. దీంతో ప్రజలు, వాహనదారులు ఆగ్రహానికి గురయ్యారు.