వరద కాలువకు నీటి విడుదల

NZB: శ్రీరామ్ సాగర్‌కు ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్‌కు వరద వస్తుండటంతో అధికారులు వరద కాలువ (IFFC) ద్వారా నీటిని మిడ్ మానేరుకు తరలించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇందిరమ్మ వరద కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. కాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాలువ పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.