ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ మాఫీ: కమిషనర్
KDP: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ మునికుమార్ శుక్రవారం తెలిపారు. 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. రాయితీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.