యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి

యాసిడ్ తాగి వృద్ధురాలు మృతి

SDPT: రాయపోల్(M) వడ్డేపల్లికి చెందిన ఎలుగు అనసూయ (65)అనే వృద్దురాలు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఇవాళ కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా, ఆమె దాహం వేయడంతో యాసిడ్ బాటిల్‌‌ను వాటర్ అనుకుని తాగగా అస్వస్థతకు గురైంది. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె నోటిలో నుంచి నురుగు రావడం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వృద్దురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.