6,175 ఉద్యోగాలు.. BIG UPDATE

TG: వైద్య ఆరోగ్య శాఖలో పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. త్వరలో 6 వేల మందికి పైగా కొలువులు పొందనున్నారు. గతేడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో నర్సులు, ఫార్మసిస్టులు, ANMలు, ల్యాబ్ టెక్నీషియన్‌లు తదితర పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి. నర్సుల పరీక్ష ఫలితాలు మే 5న, ఫార్మాసిస్టులకు సంబంధించి మే 12న, మిగిలినవి 19న ఫలితాలు రానున్నాయి.