4 వార్డ్‌లు ఏకగ్రీవం.. సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు
MNCL: తాండూర్ మండలం నీలాయిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8 వార్డు స్థానాలకు గాను 3, 5, 6, 7వ వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలో 15 జీపీలు ఉండగా, నీలాయిపల్లి సర్పంచ్ స్థానానికే అత్యధికంగా ఏడుగురు పోటీలో ఉన్నారు. పంచాయతీలో మొత్తం 292 మంది ఓటర్లు ఉండగా, మహిళలు 148, పురుషులు 144 మంది ఉన్నారు.