'24న నల్గొండలో లింగాయత్ వివాహ పరిచయ వేదిక'

NLG: విశ్వ లింగాయత్ ట్రస్ట్ వారి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు పసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నల్గొండలోని సావర్కర్ నగర్ శ్రీ బసవేశ్వర భవన్‌లో వీర శైవ లింగాయత్ లింగ బలిజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు ఇమ్మడి పరమేశ్ తెలిపారు. బుధవారం సంఘం భవనంలో వివాహ పరిచయ వేదిక పోస్టర్‌ను వారు ఆవిష్కరించి మాట్లాడారు.