VIDEO: కొలకలూరు శ్రీ అగస్తేశ్వర ఆలయంలో చోరీ
GNTR: తెనాలి మండలం కొలకలూరులోని ప్రసిద్ధ శ్రీ అగస్తేశ్వర ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకుడు హుండీని పగులగొట్టి ఉండటం గమనించి ఈవోకు సమాచారం ఇచ్చారు. హుండీ ధ్వంసం చేయడానికి ఉపయోగించిన పలుగును ఆలయ ఆవరణలోనే వదిలి వెళ్లారు. గతంలోనూ ఇదే ఆలయంలో చోరీలు జరగడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.