'తంబళ్లపల్లెలో 270 మందికి వ్యాక్సిన్'

'తంబళ్లపల్లెలో 270 మందికి వ్యాక్సిన్'

CTR: తంబళ్లపల్లె మండల వ్యాప్తంగా గురువారం 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 270 మంది పెద్దవారికి బీసీజీ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కోసువారిపల్లె పీహెచ్‌సీ వైద్యాధికారి మునికుమార్ తెలిపారు. క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ టీకాను పంపిణీ చేస్తోందన్నారు.