నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్

NTR: నందిగామ నియోజకవర్గం చందాపురంలో డయేరియా వ్యాధి వేగంగా ప్రబలుతున్నందున మున్సిపల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్య దృష్టా నియోజకవర్గం వ్యాప్తంగా వారం రోజుల పాటు అన్ని రకాల మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 8 వరకు నాన్ వెజ్ వంటకాలపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. నింబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.