VIDEO: సర్పంచి ప్రమాణ స్వీకారాలకు పంచాయితీలు సిద్ధం

VIDEO: సర్పంచి ప్రమాణ స్వీకారాలకు పంచాయితీలు సిద్ధం

NLG: పంచాయతీ ఎన్నికల సమరం ముగియడంతో ఇప్పుడు పల్లెల్లో ప్రమాణ స్వీకార సందడి మొదలైంది. సర్పంచులు ఈ నెల 22న పదవీ బాధ్యతలు స్వీకరించనుండటంతో గ్రామ పంచాయతీ కార్యాలయాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచుల ఆదేశాల మేరకు పంచాయతీ భవనాలకు రంగులు వేయించి, తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు.