VIDEO: 'డిగ్రీ కళాశాలను తీసుకువచ్చే బాధ్యత నాది'

VIDEO: 'డిగ్రీ కళాశాలను తీసుకువచ్చే బాధ్యత నాది'

E.G: గోకవరం మండలంలో డిగ్రీ కళాశాలను తీసుకొచ్చే బాధ్యత తనపై ఉందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన PTM 3.0లో ఆయన పాల్గొన్నారు. మండలానికి కొత్త గ్రామాలు చేరిన నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంపల్సరీగా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తానన్నారు.