బుక్కాపురంలో కొండచిలువ కలకలం

KRNL: నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంగా ఉండే బుక్కాపురం గ్రామంలో నాగుపాములు, కొండచిలువల సంచారం రోజువారీ సమస్యగా మారింది. మంగళవారం తెల్లవారుజామున గ్రామస్థుడు విజయ్ ఇంటి వద్ద భారీ కొండచిలువ కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ గంటసేపు శ్రమించి పది అడుగుల కొండచిలువను బంధించి, నల్లమల అడవిలో సురక్షితంగా వదిలేశాడు.