క్రీడాకారులపై దాడి..కేసు నమోదు

RR: చందానగర్ లోని PJR స్టేడియం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు క్రీడాకారులపై ఆదివారం దాడి చేశారు. స్టేడియంలో రాథోడ్ యుగేందర్, ఆదిత్యలపై కార్తీక్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి దాడి చేశాడు. మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టడంతో ఆదిత్యకు గాయాలు కాగా..అతని మెడలో ఉన్న చైన్‌ను లాక్కున్నారు. దీంతో వారు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.